ఓంకార్ మొదటి సినిమా జీనియస్ డిజాస్టర్ అయినప్పటికీ... చాలా పట్టుదలతో రెండో సినిమా తీసి గట్టెక్కేశాడు. ఈ చిత్రం ఇప్పుడు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా ఏ మాత్రం భయపెట్టలేకపోయిందనీ, కానీ నవ్వించిందని క్రిటిక్స్ నుంచి కామెంట్లు వచ్చాయి. ప్రారంభంలో కొద్ది స్క్రీన్లలో విడుదల చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆ సంఖ్యను పెంచబోతోంది. హర్రర్ కామెడీ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చినా కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది. జీనియస్ లాంటి ప్లాప్ తర్వాత ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన రాజు గారి గది సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది. ఈ దసరా కానుకగా గురువారం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్ లను రాబడుతోంది దీంతో ఈ సినిమాను మరిన్ని ధియేటర్లలలో వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గది సినిమాకు సాయి కొర్రపాటి, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేట్ కు అమ్ముకున్న ఓంకార్.. తన చిత్రాన్ని మరిన్ని ధియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించాడు. ఈ సినిమాలో ఓంకార్ జబర్దస్ట్ టీంను బాగానే వాడుకున్నాడు. షకలక శంకర్, ధన్ రాజ్, సప్తగిరిలు కామెడీ సీన్లకు ధియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. చివరి వరకు సస్పెన్స్, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.