బుల్లి తెర ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా కొన్నాళ్ళు చాలా మణి అయిన ఓంకార్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద పడ్డారు. అయితే బుల్లి తెర అనుభవంతో దర్శకుడిగా మారిన ఓంకార్ తన మొదటి సినిమా ‘జీనియస్’ చేశారు. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్ ఓ హర్రర్ కామెడీ‘రాజుగారి గది’ అనే సినిమా చేశారు. ఈ సినిమా త్వరలో తెరమీదకు రాబోతోంది.
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం కాస్త కష్టతరంగా అలాంటి రాజుగారి గదిని విడుదలకు ముందే మా టీవీ ప్రచార హక్కులను సొంతం చేసుకుంది. ఓ చిన్న సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే అమ్ముడుపోవడం చెప్పుకోదగిన విషయం. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. మా టీవీ వారు 1.60 కోట్లకి రాజుగారి గది శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. అశ్విన్ ఓంకార్, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, శకలక శంకర్, ధన్ రాజ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.