‘బాహుబలి’ సినిమాలో హీరోయిన్లు అనుష్క, తమన్న అనుకున్నాం. కానీ అనుష్క లేదట. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారు కదా? నిజానిజాలు ఆ సినిమా యూనిట్ చెపితేగానీ తెలియదు. అయితే, తాజా సమాచారం ఏంటంటే విడుదలయ్యే మొదటి భాగంలో అనుష్క లేదంటున్నారు. తొలి భాగంలో ప్రభాస్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలూ ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నారు మొదట్లో. కానీ, తొలి భాగం రిలీజయ్యాక గానీ రెండో భాగం షూటింగ్ జరపాలని నిర్ణయించారు కాబట్టి మొదటి భాగంలో అనుష్క కనిపించదు. ఈ వార్త నిజమైతే అనుష్క అభిమానులు ఆమెను చూడాలంటే రెండో భాగం కోసం ఎదురు చూడాల్సిందే.