హ్యాపీ న్యూ ఇయర్ తరువాత షారుక్ ఖాన్ నటించబోయే చిత్రంలో కథానాయికగా పరిణితి చోప్రా ఎంపికైందనే టాక్ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనిని పరిణితి కొట్టిపడేసింది. తాను షారూక్ తదుపరి చిత్రంలో నటించట్లేదని ప్రకటించేసింది. ‘ఈ వార్త వెలువడ్డప్పటి నుంచి తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు, అభిమానుల నుంచి అభినందన మేసేజ్ లు వరదల్లా వచ్చి పడుతున్నాయి. నిజానికి ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే షారుక్ నే అడిగిచూడండి!’ అంటూ తెగేసి చెప్పింది. అంటే పరిణితి రొమాన్స్ కుర్రహీరోల వరకే పరిమితమన్న మాట. ప్చ్... ఏం చేస్తాం.