ప్రముఖ నటి త్రిష నిశ్చితార్థం చెన్నైకి చెందిన రియల్టర్, నిర్మాత వరుణ్ మానియన్ తో జరిగినట్లు ఇటీవల వార్త ఒకటి బయటికొచ్చింది. ఇక ఈ వ్యవహారం పై స్పందించిన త్రిష... ‘అసలు ఇలాంటి రూమర్లు ఎవరు సృష్టించారో అర్థం కావడం లేదు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు అంటూ మీడియాపై చిందులేసింది. ప్రస్తుతం నేను షూటింగ్ నిమిత్తం అరకులో ఉన్నాను అలాంటప్పుడు ఆ వార్త ఎలా నిజమవుతుంది. అయినా నిశ్చితార్థం మనేది నా జీవితంలో మరుపురాని రోజు. కాబట్టి కచ్ఛితంగా ముందుగా ప్రకటించి గొప్పగా జరుపుకుంటానే తప్ప. ఇలా రహాస్యంగా చేసుకోవాల్సిన అవసరమేముంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా నమ్మశక్యంగానే ఉంది కానీ, తెరపైకి వరణ్ మానియన్ పేరు అసలు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే చెన్నై చిన్నది చిన్నగా నవ్వి దాటవేసింది. నిప్పు లేనిదే పొగ రాదంటే ఇదేనేమో...