రెహ్మాన్ మతాన్ని కించపరుస్తున్నాడా?

September 11, 2015 | 06:03 PM | 6 Views
ప్రింట్ కామెంట్
ar-rahman-niharonline

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది ముస్లిం మత తత్వానికి సంబంధించినది కావడం, అందులో ముస్లిమ్స్ లోనూ కొన్ని తెగలు ఉండడంతో ఒక వర్గం ఈ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే ఆయన సినిమాకు సంబంధించి ముంబైకి చెందిన సున్ని ముస్లిం గ్రూప్ ఫత్వా జారీ చేసింది. ముస్లిం ఆధ్యాత్మిక గురువు ప్రొఫెట్ మహ్మద్ పై సినిమా బ్యాన్ చేయాలని ముందు నుండి డిమాండ్ చేస్తున్న సున్నీ గ్రూఫ్ ఇపుడు ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. ఏఆర్ రెహమాన్ మీద మాత్రమే కాదు, ప్రముఖ ఇరానియన్ ఫిల్మ్ మేకర్ మాజిద్ మాజిదికు వ్యతిరేకంగా కూడా ఫత్వా జారీ అయింది. ‘మహ్మద్- మెసెంజర్ ఆఫ్ గాడ్' పేరుతో సినిమా వస్తున్న నేపథ్యంలో సున్ని ముస్లిం గ్రూఫు ఈ ఫత్వా జారీ చేసింది. సినిమాలో ప్రొఫెట్ మహ్మద్‌కు సంబంధించిన ఎలాంటి పదం కానీ, విజువల్స్ కానీ ఉపయోగించరాదని సున్ని ముస్లిం గ్రూపు డిమాండ్ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ