పుకార్లకు ‘పవర్’ పుల్ స్టాప్

January 23, 2015 | 03:08 PM | 144 Views
ప్రింట్ కామెంట్

ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఆరోగ్యం బాగా లేదనీ ఆపరేషన్ అవసరమని చాలా వార్తలు వచ్చాయి. ఆయనకు వెన్నునొప్పి ఉందనీ, నిలబడడం కూడా కష్టంగా ఉందనీ, ఎక్కువ సమయం కూర్చోలేడని కూడా ప్రచారం జరిగింది. పవన్ త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్ళి వెన్ను నొప్పికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంటాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ మధ్య కాలంలో అవేమీ వినిపించడం లేదు పైగా వపన్ కళ్యాణ్ ఆరోగ్యంగానే కనిపిస్తున్నాడు కూడా. ఈ మధ్య ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ లోనూ, సినిమా సక్సెస్ కు సంబంధించిన ఇంటర్వ్యూలోనూ చాలా హుషారుగా కనిపించారు. పైగా ఇంతకు ముందుకన్నా చాలా గ్లామర్ గా ఉన్నాడిప్పుడు. అనారోగ్య ఛాయలేమీ కనిపించడం లేదు. పేపర్లలో వచ్చిన పుకార్లకు ఏ మాత్రం స్పందించకుండా, తన ఆరోగ్యమేమిటో తనను చూస్తే తెలుస్తుందన్నట్టు పవన్ ఊరుకున్నట్టున్నారు. మరి ఎందుకింతలా ఆయనపై పుకార్లు వచ్చాయో అర్థం కాదు. ఇప్పుడు రాబోయే సినిమా ‘గబ్బర్ సింగ్ 2’ చిత్రం పనులపై సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పవన్, కె.ఎస్.రవీంద్ర ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ స్క్రిప్టుకు సంబంధించి తుది చర్చల్లో కూడా పవన్ కళ్యాన్ పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఇక సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఒకేసారిగా నటినటుల ఎంపిక, ప్రొడక్షన్ పనులు జరుగుతాయనీ వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రారంభించే ఆలోచనలో చిత్ర యూనిట్ త్వరత్వరగా పనులు చేసుకుపోతున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ