తెర మీద కనిపించే పవన్ కళ్యాన్ ఒకరయితే, తెర వెనుక కనిపించే పవన్ ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి. సినిమా షూటింగ్ లేనప్పుడు తన ఫామ్ హౌజ్ లో ఇలా బిజీగా ఉంటాడు ఆయన. షూటింగ్ లేనప్పుడు తన ఫామ్ హౌజ్ లో రకరకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రసాయనాలతో కూడిన వ్యవసాయమే ఎక్కువగా సాగవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. విజయరామ్ అనే వ్యక్తితో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రసాయన సేద్యాన్ని విడిచి ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించడానికి విజయరామ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. విజయరామ్ సహకారంతో తన ఎనిమిది ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కల సాగు ప్రారంభించారు. రసాయనాల అవసరం లేని గో ఆధారిత సాగు వ్యవసాయం దగ్గరుండి పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలా పండించిన పంటల రుచులు వేరని చెబుతున్నారీయన. ఈ పద్దతి ద్వారా చిన్న తనంలో నాయనమ్మ వండిపెట్టినప్పటి రుచిని ఇప్పుడూ ఆస్వాదించవచ్చునంటున్నారు. రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలని ఆశిస్తూ....అందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.