పాత సినిమాల్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం లాంటి వాళ్ళ పాట కోసం సినిమా చూసే వాళ్లు... ఇప్పుడూ అదే నడుస్తోంది కానీ ఆ పాటలకు ప్రత్యేకమైన వారు మాత్రం లేరు. ఈ మధ్య ఏకంగా హీరోయిన్లే ఐటెమ్స్ గార్ల్స్ పాత్రల్ని లాగేసుకుంటున్నారు. పాపం మొమైత్ ఖాన్ కు ఇక ఛాన్స్ ఎక్కడిది? డాన్స్ తను ఎంత బాగా చేయగలదు... తన డాన్స్ కోసమే సినిమా చూసే వాళ్లూ ఉన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ట్రెండ్ ను ఇప్పటి హీరోయిన్లు పాటిస్తున్నట్టున్నారు. ఒక సినిమా పూర్తి చేస్తే కోటి రూపాలయ రెమ్యునరేషన్ వస్తే, ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసే ఐటమ్ సాంగ్ కు 30 నుంచి 40 లక్షలు ఇస్తుంటే... పెద్దగా కష్టపడకుండానే ఇంత మొత్తం వస్తుంటే, కురచ దుస్తులు వేసుకుంటే తప్పేంటి? అన్నట్టుగా ఉంది హీరోయిన్ల వాలకం. ఇటీవల శ్రుతి హాసన్, తమన్నా, శ్రీయ, ఛార్మి, అనుష్క లాంటి వాళ్ళు కూడా ఐటమ్స్ సాంగ్స్ కు ఎగబడి పోతున్నారు. ఆగడు సినిమాలో శ్రుతి ఐటమ్ సాంగ్ కు 40 లక్షలు తీసుకుందట. పూర్తి నిడివి గల సినిమాకు కోటి పైగా తీసుకుంటుంటే, ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తే 40 లక్షలు వస్తుంటే... అది బెటరా? ఇది బెటరా? అల్లుడు శీను సినిమాలో తమన్నా ఐటమ్ గర్ల్ అయిపోయింది. అయితే ఇక్కడో విషయం చెప్పుకోవాలి. అదేమిటంటే ఐటమ్ సాంగ్ చేసినందుకు డబ్బుతో పాటు ఇంకో ప్రయోజనం కూడా ఉంది ఆ ఐటమ్ సాంగ్ చేసే హీరోతో తిరిగి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడానికి కూడా ఇలా చేస్తున్నారట. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న మాట. డబ్బుకు డబ్బు... ఇంకో సినిమాలో అవకాశం... ఎంత తెలివైన వారు ఈ హీరోయిన్స్.... ఇక ఛార్మికి సినిమాలు తగ్గి తను కూడా ఐటమ్ సాంగ్ ఛాన్స్ వస్తే ఓకే అంటోంది. ఇక బాలీ వుడ్ లోనూ ఈ ట్రెండ్ బాగానే నడుస్తోంది వాళ్ళయితే కోటి రెండు కోట్లు పై మాటే నట. మొత్తానికి ఐటమ్ గార్ల్స్ పొట్ట కొట్టేస్తున్నారు హీరోయిన్లు.