నిజమండీ... సమాజానికి మంచి చేసే పనులకు తోడ్పడుతున్నారు... మహేష్ బాబు శ్రీమంతుడు తీసి... ఆ తరువాత రెండు ఊర్లను దత్తత తీసుకుని తమ సేవా భావాన్ని చాటుకున్నారు. ఈయన ఎంతో మందికి స్ఫూర్తి నిచ్చి మరికొందరు ముందుకు వచ్చేలా చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఫ్యాన్స్ చేసిన తొందరపాటు చర్యలకు ఆయన నష్టపరిహారం ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ విని ఫైర్ అయిపోయాడట. ఎందుకంటే ఆ పాటలో మరీ అశ్లీలత ఎక్కువగా అనిపించిందట ఆయనకు. ఇలాంటి బూతు పాటలు వద్దు అన్నాడట. మళ్ళీ మార్చమని వాళ్ళను కోరాడట. ఈ చిత్రం కోసం గబ్బర్ సింగ్ ఐటెం సాంగ్ రేంజ్ లో ఓ పాట ఉండాలని దర్శకుడు బాబీ కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు చెప్పాడట దాంతో వాళ్ళు భారీ లెవల్లో ఓ ఐటెం సాంగ్ ని చేయించి పవన్ కు వినిపించారట... ఇంకేముంది పాట వినేసరికి పవన్ కు చాలా కోపం వచ్చిందట. ఎందుకంటే ఆ పాట మరీ పచ్చి పచ్చిగా పిచ్చి లేపేలా ఉండడమే. ఇలాంటి బూతు పాటలు మన సినిమాలో పెట్టద్దని వార్నింగ్ లాంటిది ఇచ్చాడట. దాంతో పాట ని మార్చే పనిలో పడ్డారట దేవిశ్రీ ,బాబీ లు. ఇలాంటి పాటలతో సినిమాకు హైప్ తీసుకురావాలని డబుల్ మీనింగులతో సాహిత్యం జోడించి, కురచదుస్తుల్లో ఐటమ్ భామలను నర్తింప చేస్తున్నారు. రింగ రింగ రింగ... పాట వింటే సంగీతం అదరగొట్టేలా ఉందని పిల్లలందరూ ఖుషీ ఖుషీగా పాడుకుంటున్నారు... మరి పాట మీనింగో... దేవుడా...! ‘మౌనంగానే ఎదగమనీ... కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..’ పాటలు రాసిన చంద్రబోసేనా రింగ రింగ పాట రాసింది అని అనుమానం వస్తుంది. ఇంతకూ పవన్ బూతు పాటకు నర్తించే భామ ఎవరో తెలుసుగా? రాయ్ లక్ష్మి. మరి మలైకాని మించిపోతుందో లేదో చూడాలి.