రాజకీయాలపై పవన్ ప్రెస్ మీట్ త్వరలో...

June 29, 2015 | 04:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Pawan_Kalyan_niharonlione

గత కొద్ది కాలంగా పవన్ పై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఏ విధంగానూ స్పందించక, జనాల బుర్రలను క్వెశ్చన్ మార్క్ చేసేశాడు పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను కొనిన షేర్ చేసుకున్నాడు. ఆయన తాజా  రాజకీయ పరిణామాలపై

స్పందిస్తూ.... ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వంటి అంశాలపై మరో రెండు రోజుల్లో మాట్లాడతానని ప్రకటించారు. కుదిరితే ఈ వారాంతంలో, లేదా వచ్చేవారం ప్రారంభంలో ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలు చెబుతానని వెల్లడించాడు. రాజకీయ నాయకుల తీరుపై స్పందించిన ఆయన ‘తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే- పిల్లలు కొట్టుకుంటూ లేస్తా’రనే సామెతను ఆయన గుర్తు  చేశారు. ఈ సామెతను ఇప్పటి  రాజకీయాలకు లింక్ చేశారాయన. పాలకులు బాధ్యత లేని పాలనతో, మాటలతో ప్రభుత్వాలు నడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయని పవన్ హెచ్చరించారు. పాలకుడి ఆలోచనపైనే ప్రతివిషయం ఆధారపడి ఉంటుందని, మన నాయకుల ఆలోచనలు మనల్ని భవిష్యత్తులో ఏ తీరాలకు చేరుస్తాయో చూడాలని ఆయన అన్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ