బాల నటిగా ఎన్నో సినిమాల్లో నటించి.... అప్పుడే ఇంత ఎదిగిందా? అని ముక్కున వేలేసుకునేలా సినిమా హీరోయిన్ అయిపోయింది... ఇంతింతై వటుడింతై... అన్న చందంగా చకచకా సినిమాలు చేసేసి... అంతే ఫాస్ట్ తెరకు దూరమైంది కూడా... బొద్దైన ఈ ముద్దు గుమ్మ 90 మొదట్లో చాలా సినిమాలు చేసి, కొన్నాళ్ళ తర్వాత అసోసియేట్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది . పైగా పెళ్ళయ్యాక బాగా లావు కావడంతో కూడా సినిమాల వైపు చూడలేదు కానీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత సినిమాల్లోకి రావడానికి ఉత్సాహం చూపిస్తోంది . ఇక రాశి ఒక బిడ్డ కు తల్లి కూడా అయ్యింది . ఆ పాప పేరు రిథిమ . రాశి తల్లి కావడంతో ముద్దులొలికే ఆ పాపతో ఆడుతూ పాడుతూ ప్రపంచాన్నే మరిచిపోతోందట... జీవితంలో అత్యంత ఆనందంగా గడిపే రోజులంటే తల్లయ్యాక ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకోవడంలోనే ఉంటుంది. మరి... ఇప్పుడు అదే ఎంజాయ్ లో ఉంది రాశి.