అట్టహాసంగా జరిగిన గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ లో అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి అందరికీ విధితమే. పవన్ అభిమాని పై దాడి జరిగి ఆస్పత్రి పాలయ్యాడు.ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దాడి ఘటన తనను ఎంతగానో డిస్ట్రబ్ చేసిందనీ,అతన్ని నేను స్వయంగా వెళ్ళి కలుస్తానని, అభిమానులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పవన్ కళ్యాన్ స్వయంగా అతనింటికి వెళ్లి పరామర్శించాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శిల్పకళా వేదిక ఆవరణలో బ్లేడ్ పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి చిత్రాన్ని మీడియాకు అందించారు. అతని ఆచూకీ తెలిస్తే 9493549415, 9491030063 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.