వర్మ ఏంటి నీకీ కర్మ

November 21, 2014 | 12:11 PM | 50 Views
ప్రింట్ కామెంట్

డైరక్టర్ రాంగోపాల్ వర్మకి టైం బాడ్ నడుస్తుందేమో. ఈ మధ్య ఏకంగా దేవుడి మీదే సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలతోపాటు అదనంగా కేసులు కూడా ఎదుర్కుంటున్నాడు. తాజాగా వర్మ ట్విట్టర్ లో వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదమయ్యాయి. తెలంగాణలోని యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి కన్నా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దేవుడినే తెలంగాణ ప్రజలు ఎందుకు ఎక్కువగా పూజిస్తారు? అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. మతాలకతీతంగా దేవుళ్లను పూజించే సంస్క్రుతి మనది. అలాంటప్పుడు ఏ దేవుడిని ఎవరూ పూజించడం ఓ మూర్ఖమైన ప్రశ్న. ఇక ఈ వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలువురు కోర్టులను ఆశ్రయించారు. కేసు నమోదుకు కోర్టులు కూడా ఆదేశాలు జారీ చేశాయి. వివాదం కోరుకున్నప్పుడల్లా ప్రత్యేకంగా దేవుళ్ల మీదే ఏదో ఒక కామెంట్ చేస్తూ ఇలా వివాదాస్పదమౌతున్నారు. వీటిపై వివరణ అడిగితే తెలియని విషయాన్ని తెలుసుకోడానికే అలా ప్రశ్నించా అని ఓ సమాధానాన్ని పడేస్తున్నారు. ట్విట్టర్‌లో అయితే ఎక్కువగా ఎవరు పట్టించుకోరని అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో మాస్టారూ... జనాలంతా ఇప్పుడంతా వాటిల్లోనే ఉంటున్నారు. ఒకవేళ అక్కడ మిస్సయినా మీడియా ఉండనే ఉందిగా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ