ఎర్ర బస్సును తొక్కేసింది

November 15, 2014 | 05:22 PM | 48 Views
ప్రింట్ కామెంట్

ఈ శుక్రవారం రిలీజైన రెండు చిత్రాల మొదటి రోజు కలెక్షన్లలో పిల్లా నువ్వులేని జీవితం పైచేయిగా నిలిచింది. పోటీగా విడుదలైన దర్శకరత్న దాసరి ఎర్రబస్సు చిత్రం దీనికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇటీవల విడుదలైన నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, గోపిచంద్ ‘లౌక్యం’ చిత్రాల మొదటి రోజు కలెక్షన్ల కంటే ఎక్కువ సాధించి ముందుకు దూసుకెళ్తుంది . రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు ఈ చిత్రం మొత్తం రూ. 2.28 కోట్లు సాధించింది. ఇక ఎర్రబస్సు చిత్రం మొదటిరోజు మొత్తంగా కేవలం రూ.15లక్షలు మాత్రమే వసూలు చేసి ఓపెనింగ్స్ సాధించి మెగా అల్లుడి చిత్రంతో ఏమాత్రం పోటీ పడలేకపోయింది. ఫ్యామిలీ అండ్ ఓవర్ సెంటిమెంట్ కావడం ఎర్రబస్సు చిత్రానికి మైనస్ అనే చెప్పవచ్చు. ఇక పక్కా మాస్ ఎలిమింట్స్ తో కూడిన లవ్ అండ్ యాక్షన్ చిత్రం కావడంతో రాబోయే రోజుల కలెక్షన్లు ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం వైపే ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ