టాలీవుడ్ లో ఒకేసారి రెండు భారీ జానపద చిత్రాలు మొదలై, పోస్టర్లతో అదరగొట్టేశాయి. కానీ ఎందువల్లో ముందుగా విడుదలవుతుందనుకున్న రుద్రమదేవి వెనుకబడి పోయింది. రకరకాల వార్తలు వస్తున్నాయి గానీ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. బాహుబలి మూవీలోని స్టార్ కాస్టింగ్ కంటే ఎక్కువ మంది, రుద్రమదేవి మూవీలో ఉన్నారు. కాని రుద్రమదేవి మూవీ మాత్రం రిలీజ్ వద్దకు వచ్చి ఎందుకు వెనకడుగు వేస్తుందో అర్ధం కావటం లేదు. ఇదిలా ఉంటే రుద్రమదేవి మూవీలో నటిస్తున్న ఇద్దరు లీడ్ రోల్స్ అనుష్క, రానా. అయితే వీరిద్దరూ రుద్రమదేవి మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తైన తర్వాత నుండి, ఎప్పుడూ ఆ మూవీకి సంబంధించిన విశేషాలను బయటకు చెప్పలేదు.
రుద్రమదేవి మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ లోనూ పాల్గొనలేదు. కనీసం ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ రుద్రమదేవి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జరగలేదు. ఇలా ఏ రకంగా చూసిన రుద్రమదేవి మూవీకి పబ్లిసిటి విషయంలో అన్యాయమే జరిగింది. అయితే దీనంతటికి కారణం డైరెక్టర్ గుణశేఖర్ అని అంటున్నారు. బాహుబలి కాస్టింగ్ చేత రాజమౌళి ఏ విధమైన పబ్లిసిటి చేసి, వారిని ఉపయోగించుకున్నారో....అందులో కొద్ది శాతం కూడ రుద్రమదేవి కాస్టింగ్ ని గుణశేఖర్ పబ్లిసిటి కోసం ఉపయోగించలేదు. మొత్తంగా ఈ ఎఫెక్ట్ ని మూవీకి బిజినెస్ జరగకపోవటానికి దారి తీసింది. బాహుబలి విజయం చూసిన తర్వాత, గుణశేఖర్ ఇప్పుడు ప్రమోషన్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు. మొత్తంగా ఈ మూవీ ఎటువంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలనుకునే వారి ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతోంది.