ఏ పాత్రనైనా సరే తనదైన శైలి డైలాగు డిక్షన్ తో కామెడీ పంథాలో పోషించి మెప్పించే ప్రముఖ క్యారెక్టర్ నటుడు పోసాని కృష్ణమురళి మరో వైవిధ్యమైన పాత్రకు ఓకే చెప్పాడు. మెగా హీరో రామ్ చరణ్ హీరోగా తమిళ్ హిట్ తని ఒరువన్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలకపాత్రలో నటించడానికి పోసాని అంగీకరించినట్లు సమాచారం. టెంపర్ లో మూర్తి తరహా పాత్రలోనే సినిమా చివరిదాకా ఈ క్యారెక్టర్ రన్ అవుతుంటుందని సమాచారం.
అయితే ఆయన హీరో తండ్రి క్యారెక్టర్లో నటించబోతున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి మాతృక తమిళ్ లో జయం రవికి తండ్రి పాత్రే ఉండదు. విలన్ అరవింద స్వామికి తండ్రి పాత్రలో సీనియర్ నటుడు తంబిరామయ్య నటించాడు. కంప్లీట్ ఫన్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావటంతో పోసాని అంగీకరించినట్లు సమాచారం. ఈ పాత్రత్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనుందట.