రన్ రాజా రన్ సినిమా గురంచీ ఆ చిత్రం తీసిన డైరెక్టర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అతి చిన్న వయసు డైరెక్టర్ సుజీత్(24). ఈయనలో ఉన్న టాలెంట్ ను ప్రొడ్యూసర్లు వంశి, ప్రమోద్ లు గుర్తించారని అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ అసలు కథ వేరే ఉందండీ ఈయనలో ఉన్న టాలెంట్ ను గుర్తించిన వారు ప్రభాస్ అంటున్నాడు సుజీత్. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్న సుజిత్ లో టాలెంట్ మెండుగా ఉందని, ఇతను సినిమా కూడా చేయగలడని నమ్మి సుజిత్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అట. అలా ప్రభాస్ ప్రోత్సాహం వల్లే ఈరోజు నేను దర్శకుడిని కాగలిగాను అని చెబుతున్నాడు సుజిత్ . రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రం ఇంత చిన్న వయసులో తీయగలనని ఈ కుర్రడైరెక్టర్ ఊహించి ఉండడు.. ఆ సినిమా చేయడానికి ముందు పలు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్న సమయంలో ప్రభాస్ అతడిలోని టాలెంట్ ని నమ్మి అతడికి చాన్స్ ఇవ్వండని తన యువి క్రియేషన్స్ స్నేహితులతో చెప్పాడట. దీంతో ఈయనతో చాలా తక్కువ పెట్టబడితో నిర్మించిన ఈ సినిమా 2014 బిగ్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు ముందు దాదాపు 38 షార్ట్ ఫిల్ములు తీశాడట సుజీత్. ఈయనకున్న ఈ సినిమాల పిచ్చే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చింది.