ప్రభాస్ భీమవరం బుల్లోడు అనే టాక్ బాగా వచ్చింది. బాహుబలి సినిమా సందర్భంగా భీమవరం మొత్తం ఈ సినిమా కటౌట్స్ తో నింపేశారు. అంతే కాదు భీమవరాన్ని మాహిష్మతి రాజ్యం చేసేశారు కూడా. ఇదంతా చూసి ప్రభాస్ సొంతూరు భీమవరం అనుకున్నారంతా. కానీ అసలు ప్రభాస్ కు భీమవరానికి సంబంధం లేదన్న వార్త లేటెస్ట్ గా వినిపిస్తోంది. వీళ్ళ తల్లిదండ్రులు స్వస్థలం కూడా మొగల్తూర్, వేస్ట్ గోదావరి జిల్లా అని తెలుస్తోంది.
ఇక ఈ చర్చతో పాటు ఇప్పటివరకూ ప్రభాస్ కేవలం తెలుగు ఇండస్ట్రీకి తప్ప బాలీవుడ్, కోలీవుడ్ పరిచయం లేదు. దీంతో ఎవరీ ఆరడుగుల ఆజానుభాహుడు అని ఆరా తీస్తున్నారట. మలయాళం తమిళ్ కన్నడం మలేషియా కెనడా సింగపూర్ దుబాయ్ అమెరికా బ్రిటన్.. ఇన్నిచోట్ల ప్రభాస్ ఎవరో తెలుసుకుంటున్నారట.
ఇంతకూ ఈయనను ఎక్కడ కలవాలి? హైదరాబాద్ లోనా లేక అతడి నేటివ్ ప్లేస్ భీమవరం వెళ్లాలా? అనే చర్చ...
వాస్తవానికి ప్రభాస్ తల్లిదండ్రులు పెదనాన్న (కృష్ణంరాజు) తదితర కుటుంబ సభ్యులు భీమవరంలో ఉన్నారట. ప్రభాస్ స్కూల్ చదువు మాత్రం డిఎన్ఆర్ భీమవరంలో జరిగింది. ఆ తరువాత ఇంటర్ శ్రీచైతన్య, హైదరాబాద్ లో చదివినట్టు ఉంది. ప్రభాస్ పుట్టింది చెన్నయ్ లోనే. మరి ఆ స్కూల్ సంబంధమేనా? ఇప్పుడు భీమవరం బుల్లోడు గా పేరు తెచ్చుకోవడానికి గల కారణం? దీనికి ప్రభాస్ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో....