బాహుబలి ఇక నేషనల్ స్టార్

March 14, 2016 | 04:58 PM | 8 Views
ప్రింట్ కామెంట్
Prabhas-sujith-movie-trilingual-niharonline

జక్కన్న చెక్కిన 'బాహుబలి' తో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటిదాకా కేవలం టాలీవుడ్ ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ లో అప్పటికే పాపులర్ అయిన ఈ మ్యాచో మ్యాన్ కి దెబ్బకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. హాలీవుడ్ మీడియా సైతం ప్రభాస్ మీద ఓ స్పెషల్ ఆర్టికల్ రాసిందంటే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశ వ్యాప్తంగా పలు భాషలలోను ప్రభాస్ పేరిట అభిమాన సంఘాలు ఏర్పాడ్డాయి. అయితే ఇది కేవలం బాహుబలికే పరిమితం కావొద్దని డిసైడ్ అయ్యారంట ప్రభాస్ తో సినిమాలు తీద్దామని లైన్ లో ఉన్న నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఆయనతో బహుభాషా చిత్రాలను చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు.

                             ప్రభాస్ స్వంత బ్యానర్ యూవీ క్రియేషన్లో రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తీయబోయేది కూడా త్రిభాష చిత్రామనే తెలుస్తోంది. నాలుగేళ్లుగా మరే హీరోతో చేయకుండా తన కోసమే వెయిట్ చేస్తున్న సుజీత్ కమిట్ మెంట్ నచ్చి ప్రభాస్ చిత్రం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ యేడాది చివర్లోనే ఈ చిత్రం ఉండనుంది. క్లీన్ లవ్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీసాఫీసర్ గా చూపబోతున్నాడంట సుజీత్. అయితే కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన యూవీ క్రియేషన్ బాహుబలితో సహా నిర్మాతగా వ్యవహరించి తమిళ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు సుజీత్ తో తీయబోయే సినిమాను తెలుగు, తమిళ్ తోపాటు హిందీ లోనూ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారంట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ