డస్కీ బ్యూటీ ఊహించి ఉండదేమో!

March 14, 2016 | 03:00 PM | 2 Views
ప్రింట్ కామెంట్
regina-nara-rohit-Jo-Achyutananda-movie-niharonline

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ రెజీనా కసాండ్ర. హిట్లు లేకపోయినా తన అందాలను ఏ మాత్రం దాచుకోకుండా చూపించి అవకాశాల మీద అవకాశాలు కొట్టేస్తుంది. నటన పరంగా పక్కనబెడితే కేవలం ఎక్స్ పోజింగ్ మీదే బండి లాగించేస్తోంది. రీసెంట్ గా మంచి అంచనాల నడుమ రిలీజైన శౌర్య కూడా అట్టర్ ఫ్లాప్ కావటంతో ఇక కెరీర్ గురించి బెంగపెట్టుకుందట. అయినప్పటికీ ఇప్పుడోక బంఫరాఫర్ తగిలినట్లు తెలుస్తోంది. 

ఓ మల్టీ స్టారర్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. 'ఊహలు గుసగుస లాడే' సినిమాతో మెగా ఫోన్ పట్టి  దర్శకుడిగా హిట్ కొట్టిన నటుడు అవసరాల శ్రీనివాస్ త్వరలో మరో ప్రాజెక్టుతో మన ముందుకు రాబోతున్నాడు.  'జో అచ్యుతానంద' పేరుతో దానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇక ఇందులో నారా రోహిత్, మరో యువ హీరో నాగశౌర్య హీరోలుగా నటించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాలో  కథానాయిక గా రెజీనాను తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలో రెజీనా నారారోహిత్ తో శంకర సినిమాలో జోడీ కట్టింది. కానీ, ఆ సినిమా ఎందుకో విడుదలకు నోచుకోలేదు. ఇక ఇప్పుడు మరోసారి రోహిత్ కలిసి నటించే అవకాశం దక్కుతుందని బహుశా రెజీనా కూడా ఊహించి ఉండదేమో! 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ