ఇండియన్ బెస్ట్ డాన్సర్ అంటే వెంటనే ప్రభుదేవ గుర్తుకు వస్తారు. అందుకే ఆయన ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలిపించుకుంటున్నాడు. డ్యాన్సర్ గా, డాన్స్ డైరెక్టర్ గా, ఆ తరువాత యాక్టర్ గా, డైరెక్టర్ గా రకరకాల అవతారాల్లో ఇండియన్ సినిమాను ఏలిన ప్రభుదేవా ఇప్పుడు సింగర్ గా కూడా నిరూపించుకోబోతున్నాడు.
తను తీస్తున్న లేటెస్ట్ మూవీ సింగ్ ఈజ్ బ్లింగ్ లో ఓ పాట పాడేస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సింగ్ ఈజ్ కింగ్ కి సీక్వెల్ గా చేస్తున్న ఈ చిత్రం రికార్డింగ్ టైంలో సరదాగా ఓ పాటకి గొంతు సవరించుకున్నాడట. సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆయన వాయిస్ సూట్ కావడంతో ఫైనల్ ఔట్ పుట్ లోనూ ఉంచాలని నిర్ణయించేశాడట మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ శిరోద్కర్. హీరో అక్షయ్ కు కూడా నచ్చటంతో ఆయన గళాన్ని ఓకే చేశారట. ఆయన డైరెక్ట్ చేస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ కోసం ఆయన చేసే కొత్త ప్రయత్నమే ఆయన గళం. ఈ మధ్య హిట్లు లేని ప్రభుదేవాకు ఈ సినిమా హిట్ కావాలని, ఆయన పాట కూడా జనాలకు నచ్చాలని కోరుకుందాం.