'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఆత్మహత్య లేక హత్య అన్న విషయంలో పోలీసులు కూడా ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. పలు అనుమానాల నేపథ్యంలో బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ ను అదుపులోకి తీసుకోవాలని భావించారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ఊరట లభించింది. రాహుల్‌ను ఏడు రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని బాంబే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో రాహుల్ అరెస్ట్ ఖాయమని వస్తోన్న వార్తలకు వారం రోజులు బ్రేక్ పడింది.
ప్రత్యూషతో రాజ్ సింగ్ సంబంధంపై అనుమానాలున్నవారి ప్రభావంతోనే ఆమె తల్లిదండ్రులను రాహుల్ రాజాసింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారని రాహుల్ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పుకొచ్చారు. ప్రత్యూష బెనర్జీ తల్లిదండ్రులు, సన్నిహితుల తెలిపిన వివరాలు సహా పోలీసులకి లభించిన పలు సాక్ష్యాలు రాహులే ఆమె మృతికి కారణమని బలాన్ని చేకూర్చుతుండడంతో, రాహుల్ అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వారం రోజుల వరకు రాహుల్ అరెస్టు వాయిదా పడింది.