కెరీర్ కి వచ్చిన తొలినాళ్లలో కేవలం గ్లామర్ షోకి తప్ప సినిమాలకు పనికి రాదని పెదవి విరిచారు. ఆ విమర్శలనే ఛాలెంజ్ గా తీసుకుంది అమీ జాక్సన్. అతి తక్కువ టైంలోనే భాష నేర్చుకోవటంతోపాటు, నటనలోను మంచి పరిణతిని సాధించింది లండన్ మోడల్. శంకర్ లాంటి దర్శకుడితో రెండు సినిమాలకు అది కూడా బ్యాక్ టూ బ్యాక్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది వరకు 'ఐ' లో బాగా నటించిన ఆమె, ఇప్పుడు 'రోబో 2.0'లో ఎంపిక కావడమే ఇందుకు నిదర్శనం.
భారీ అలాంటి ఎమీకి ఓ కొరిక మిగిలిపోయిందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించాలని వుందని అంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయం చెప్పింది. ప్రభాస్ ఇండియన్ ఐకాన్ అనీ .. అతని జోడీకట్టాలని వుందని అంది. ఆ అవకాశం వస్తుందనే నమ్మకం వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నా సైన్ చేయని ఆమె, ప్రభాస్ తో అవకాశం వస్తే మాత్రం చచ్చినా వదులుకోదంట. బాహుబలి ఇచ్చిన కిక్ ఈ బికినీ బ్యూటీకి కూడా ఎక్కేసినట్లు ఉంది.