ప్రియ మణి టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోలేదు. చెప్పుకోదగ్గ సినిమాలంటే, పెల్ళయిన కొత్తలో, గోలీమార్ తరువాత మరో రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. క్షేత్రం, ఛండి అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. టాలీవుడ్ ని దశాబ్ధం పైగా అలరించిన తార ప్రియమణి. స్టార్ హీరోయిన్ అని పేరు తెచ్చుకోకపోయినా గ్లామర్ గుప్పించి సినిమా ఆఫర్లు బాగానే సంపాదించింది. ఇక కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధపడింది. ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజర్ ముస్తఫాతో పరిచయం కాస్తా ప్రేమగా మారిన తీరును నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం నాన్నగారు ముస్తఫాతో మాట్లాడుతున్నారు. అసలు ముస్తఫాతో నా పరిచయం ప్రేమ అంతా విచిత్రం. అనుకోకుండా ఓ సెలబ్రిటీ క్రికెట్ టోర్నీలో కలిశాం. తర్వాత స్నేహం పెరిగింది. ఇద్దరి మధ్యా స్నేహానికి మించి ఇంకేదో ఉందని అనిపించింది. ముందుగా నేనే ప్రపోజ్ చేశా. అతడి నంబర్ కు ఓ ఎస్ ఎం ఎస్ పంపించాను. దానికి రిప్లయ్ వచ్చింది. నమ్మలేకపోతున్నానని అన్నాడు. అతడిలోని కామిక్ సెన్స్ చాలా ఇష్టం నాకు. ముస్తఫా ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు. నాకు పూర్తిగా ఆపోజిట్. అందుకే మేం కలిశామేమో!
పెళ్లి తర్వాత నటిస్తానా లేదా? అన్నది అప్పుడే చెప్పలేను. అప్పటికీ పరిశ్రమ నుంచి పిలుపు వస్తే తప్పకుండా నటిస్తా. నటించడానికి పెళ్లి అడ్డంకి కాదు. ముస్తఫా కూడా అర్థం చేసుకుంటాడు అంటూ ప్రేమ ముచ్చట్లు మురిపింగా పంచుకుంది ప్రియమణి...