అమ్మడి పెళ్ళి ఆగిపోయిందట... కారణం?

September 08, 2015 | 03:39 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Priyamani_at_South_Indian_actress_niharonline

తెలుగులో ఎవరే అతగాడుతో(2003) ఎంట్రీ ఇచ్చిన ప్రియ మణికి చెప్పుకోదగ్గ హిట్స్ లేవనే చెప్పాలి. యమదొంగ, కింగ్, గోలీమార్ సినిమాలు  తెలుగులో ఓ మోస్తరుగా ఆడినవి. ఈమెకు పరుత్తువీరం అనే తమిళ సినిమాలో జాతీయ అవార్డు కూడా వచ్చింది. సౌత్ లో అన్ని భాషల్లో అందరు పెద్ద స్టార్ హీరోలతో నటించింది గత మూడు నాలుగేళ్ళుగా తెరమీద కనిపించడం మానేసింది. ఆమె చేతిలో ఇప్పుడు సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది అందుకు ప్రియుడు ముస్తాఫా రాజ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఓకే అన్నారట ! అయినప్పటికీ ప్రియమణి పెళ్లి ఆగిపోయింది కారణమేమై ఉంటుందనుకుంటున్నారు? అంత పెద్దదేం కాదు కానీ, ఈ రోజుల్లో కూడా జాతకం నమ్మి పెళ్ళిని వాయిదా వేసిన హీరోయిన్ మాత్రం ప్రియమణిగా చెప్పుకోవచ్చు. అవును ప్రియమణి జాతక రీత్యా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంసార జీవితం సుఖంగా సాగకుండా పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అన్నారట జ్యోతిష్యులు. దీంతో అమ్మడి పెళ్ళి వాయిదా పడింది. ఇప్పటికే 30లో పడిన పెళ్ళికి శుభ ముహూర్తం ఎప్పుడో మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ