ఎన్టీఆర్ నేతాజీ ఇంట్రస్టింగ్ కానీ...

May 10, 2016 | 05:47 PM | 1 Views
ప్రింట్ కామెంట్
puri-NTR-netaji-announcement-niharonline

సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఇంకోటి అనౌన్స్ చేయటంలో గురువు వర్మను ఫాలో అయిపోతున్నట్లు ఉన్నాడు పూరీ జగన్నాథ్. కళ్యాణ్ రామ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే మహేష్ 25వ చిత్రం జనగణమన అని అనౌన్స్ చేశాడు. అది ఎప్పుడో ఎవరికీ తెలీయదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో నేతాజీ అంటూ అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ కి ఓ కథ వినిపించడం, అది ఎన్టీఆర్ కి నచ్చి ఓకే చేయటం కూడా జరిగిపోయాయని  వార్తలు రావటంతో అభిమానుల్లో ఆసక్తి కలిగింది. కానీ, దీనిపై కూడా క్లారిటీ మిస్సయ్యింది. అయితే ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భంగా ఈ సినిమాను గురించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. వరుస చిత్రాలను అనౌన్స్ ఈ సినిమా నేపథ్యం కళ్యాణ్ రామ్ చిత్రం తర్వాత ఏది మొదలుపెడతాడో అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ కొడదామని అనుకుంటున్నాడేమో బహుశా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ