ఎలా ప్లాన్ చేసుకుంటారో? ఏం చేస్తారో.... సెట్ లోనే అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటారో తెలియదు గానీ..., గురు శిష్యులిద్దరూ అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి పారేస్తారండీ.... ఇది ఈ దర్శకులిద్దరికే సాధ్యమనిపిస్తుంది... కొందరికి సినిమాలు తీయడానికి సంవత్సరం కూడా పడుతుంది. వీరికి నెలంటే నెలా రెండు నెలలంటే రెండు నెలలే... ఈపాటికి వారిద్దరూ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది... గురువుగారు రాంగోపాల్ వర్మ, శిష్యుడు పూరీ జగన్నాథ్.... తాజాగా ఆయన మరో సినిమాకు కమిట్ అయ్యారు. అది కూడా చిరంజీవి 150 సినిమా మొదలు పెట్టేలోగా పూర్తి చేస్తారట. ఇది ఎంత సాహసం కదా... మరి ఆయన కమిట్ మెంట్ అలాంటిది. ఆయనకు చిరంజీవి 150వ చిత్రమైనా, జ్యోతిలక్ష్మి అయినా ఒకటే అన్నట్టు ఉంటారు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే.... పూరీ జగన్నాథ్ చిరంజీవి సినిమా మొదలు పెట్టేలోగా నితిన్ తో ఓ సినిమా చేసేస్తాడట. ఆ విషయం చాలా కూల్ గా అనౌన్స్ చేసేశాడు. జూన్ 15న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాడట. దీనికి నితిన్ కూడా ఓకే అనేసాడు. సినిమా స్క్రిప్టు ఎంత బాగుంటే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అనిపిస్తుంది. ఒక పక్క నితిన్ నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ, ఇరువురూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడంపై డెఫినెట్ గా ఇది మంచి చిత్రం కావచ్చునని ఓ టాక్ అప్పుడే వచ్చేసింది. అయితే వారు కూడా అదే చెపుతున్నారు. ఇది సెంటిమెంట్‌తో, వినోద ప్రధానంగా ఉంటుందని, నితిన్ కు ఈ సంవత్సరంలో ఏం సినిమాలు లేవేమో అనుకునే ఆయన అభిమానులకు ఈ పెద్ద డైరెక్టర్ తో ఓ సినిమా ఉందనే సరికి అటు నితిన్ లోనూ, ఇటు అభిమానుల్లోనూ కాస్త ఊరట కలిగింది.