ఈ కాంబో ఊహించుకోవటం కష్టమే

May 07, 2016 | 11:51 AM | 6 Views
ప్రింట్ కామెంట్
Puri-venky-75th-film-niharonline

చిరంజీవి 150వ సినిమా, బాలయ్య 100వ సినిమా. ఇలా ప్రతి స్టార్ హీరో కెరియర్లో కొన్ని మైల్ స్టోన్స్ వుంటాయి. 50... 75... 100 సినిమా ఇలా ఆయా చిత్రాల సమయంలో వాటిని గ్రాండుగా, మెమరబుల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో నలుగురు టాప్ హీరోలో ఒకరైన విక్టరీ వెంకటేశ్ కూడా ఓ అరుదైన ఫీట్ ను సాధించబోతున్నాడు. త్వరలో తన  75వ సినిమాకి చేరువ కాబోతున్నాడు.

                                          ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న 'బాబు బంగారం' 74వ సినిమా. అంటే తన తదుపరి చిత్రం 75వది అన్న మాట. దీంతో ఆ చిత్రం కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు. దీనికి మరింత వన్నె తెచ్చేందుకు ఈ చిత్రాన్ని ఓ స్టార్ డైరక్టర్ చేతిలో పెట్టనున్నాడంట వెంకీ. ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశం వుందని  తెలుస్తోంది. పూరీ ఓ స్టోరీ లైన్ చెప్పటం, అది బాగా నచ్చడంతో దానిని డెవలప్ చేయమని వెంకీ చెప్పినట్టు సమాచారం. అయితే ఇంత వరకు సీనియర్ డైరక్టర్లను హ్యాండిల్ చేయని పూరీకి ఇది కత్తి మీద సవాలే. ఎందుకంటే వెంకీ చేేసిన  మాస్ సినిమాలన్నీ డిజాస్టర్లే. సో... ఈ కాంబో లో సినిమా అంటే విశేషమనే చెప్పుకోవాలి.  అన్నీ అనుకూలిస్తే ప్రస్తుతం తాను కల్యాణ్ రామ్ తో చేయనున్న చిత్రం తర్వాత వెంకటేశ్ చిత్రాన్నే పూరీ చేయచ్చని అంటున్నారు. అంటే మహేష్ జనగణమన మరింత ఆలస్యం కావటం ఖాయం చేసుకోవచ్చన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ