మెగా హీరోయిన్ రేంజ్ ఎంత పెరిగిందో

May 06, 2016 | 03:06 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Regina-Cassandra-chiru-150-item-song-niharonline

టాలీవుడ్ లో ఓ కుటుంబ హీరోలతో మాత్రమే వరుసగా సినిమాలు చేసుకుపోవడమంటే మాములు విషయం కాదు. కానీ, రెజీనా కెస్సాండ్రా మాత్రం మెగా కాంపౌడ్ లోని హీరోలతో మార్చి మార్చి సినిమాలు చేసుకుంటూ పోతుంది. మధ్యలో బయటి ఆఫర్లు వచ్చినప్పటికీ వీళ్లతో ఛాన్స్ లు వస్తే మాత్రం అస్సలు వదలటం లేదు. అందుకేనేమో ఓ బంఫర్ ఆఫర్ ఇప్పుడు రెజీనాను పట్టుకుంది. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన కసరత్తు భారీస్థాయిలో జరుగుతోంది. చెర్రీ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సినిమాను లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇందులో కథానాయికగా ఎవరికి ఛాన్స్ తగలనుందనే విషయం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

                           ఈ నేపథ్యంలో ఆ మధ్య నయనతార, అనుష్కల పేర్లు వినిపించాయి. తాజాగా తమన్నా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక కథానాయికల సంగతి పక్కన పెడితే ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా కనిపించనుందనే వార్త షికారు చేస్తోంది. చిరు గ్రాండ్ రీ ఎంట్రీ కావటంతో ఓ దుమ్మురేపే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. ఆ సాంగ్ కోసం రెజీనాను ఖాయం చేసుకున్నారని చెబుతున్నారు. సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ లతో జోడీ కట్టిన రెజీనా, అందుకు తగిన ప్రతిఫలం ఇలా అందుకోబోతుందన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ