నిజమా! మున్నాభాయ్ తో పూరీ సినిమానా?

March 11, 2016 | 05:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
puri-sanjay-dutt-niharonline

హీరోయిజాన్ని మాత్రం ఎలివేట్ చేస్తూ జయాపజయాలకు అతీతంగా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లే దర్శకుడిగా పూరీకి మంచి పేరుంది. ఆయన ఎప్పుడు కథలు రెడీ చేసుకుంటాడో .. ఎప్పుడు సంభాషణలు సమకూర్చుకుంటాడో తెలియదుగానీ, ఒక దాని తరువాత ఒకటిగా వరుసబెట్టి సినిమాలు సెట్స్ పైకి వచ్చేస్తుంటాయి. కథ చెప్పి ఎంతటి హీరోనైనా వెంటనే ఒప్పించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఎంతలా అంటే ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న బిగ్ బీ కలిసి బుడ్డా హోగా తేరా బాప్ తీశాడంటే పూరీ దౌత్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్టార్ దర్శకుడు త్వరలో మళ్లీ ఓ బడా బాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నాడా?

స్వయంగా పూరీ యే ఈ విషయాలను వెల్లడించాడు. ఇటీవలె జైలు నుంచి బయటికి వచ్చిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కు పూరీ ఓ కథ వినిపించాడంట. ఆ కథ ఆయనకి బాగా నచ్చిందని అన్నాడు. ప్రస్తుతం 'రోగ్' చేస్తున్న పూరీ ఆ వెంటనే సంజయ్ దత్ తో సినిమా చేస్తానని చెబుతున్నాడు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో మున్నాభాయ్ తో సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు. ఆ లెక్కన కళ్యాణ్ రామ్ సినిమా అటకెక్కినట్లేనా? పూరీ క్లారిటీ ప్లీజ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ