కీలకమైన వార్ ఎపిసోడ్ లో ప్రభాస్

March 11, 2016 | 02:48 PM | 6 Views
ప్రింట్ కామెంట్
baahubali-2-war-episode-niharonline

బాహుబలి మళ్లీ బరిలోకి దిగి పోరాడుతున్నాడు, మాహిష్మతి రాజ్యంపై దండెత్తిన శత్రువులను మట్టికరిపిస్తున్నాడు. కదనరంగంలో దూకి తన చుట్టూ చేరిన రాక్షస మూకను చీల్చి చెండాడుతున్నాడు. ప్రస్తుతం 'బాహుబలి 2' కోసం జరుగుతోన్న కీలక పోరాట సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఉడ్ ల్యాండ్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే స్టంట్ మాస్టర్ మారడండోయ్. పీటర్ హెయిన్స్ కి బదులు మాస్టర్ కిచ్చా ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ పై చిత్రీకరిస్తోన్న ఈ యాక్షన్ ఎపిసోడ్, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. తన సినిమాలో కథానాయకుడు ఉపయోగించే వెపన్ ని కొత్తగా డిజైన్ చేయడం రాజమౌళికి అలవాటు. అదే విధంగా ఆయన ఈ సినిమాలో ప్రభాస్ వాడే వెపన్ ను ప్రత్యేకంగా తయారు చేయించాడట. అది కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ పోరాట సన్నివేశాల్లో భల్లాలదేవుడు అదేనండీ రానా కూడా జాయిన్ అవుతాడని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ