పూరీకి నచ్చిన స్పానిష్ జంట...

September 19, 2015 | 04:30 PM | 2 Views
ప్రింట్ కామెంట్
spanish_couple_puri_liking_niharonline

ఫొటోలో కనిపిస్తున్నది ఇదేదో మూవీ పిక్ అనుకుంటున్నారేమో... కానే కాదు... ప్రపంచ పర్యటన చేస్తున్న ఓ స్పానిష్ జంట. ఈ జంట మన దర్శకుడు పూరీ జగన్నాథ్ దృష్టిలో పడింది. వీరి లైఫ్ స్టైల్ ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగించిందట. వీరి పర్యటన ఏ విధంగా అనుకుంటున్నారు కేవలం లిఫ్టుల ద్వారానే జరుగుతుందట. పూరీ జగన్నాథ్ కు మనుషుల్ని చదవడం చాలా ఇష్టం కదా...  గోవాలో తటస్థపడిన వీరిని పరిచయం చేసుకున్నాడు. వాళ్ళ పేర్లు మార్తా, బోరిస్.  వీరు టిక్కెట్లు, వాహనాలూ లేకుండా ఏకంగా 20దేశాలు ప్రయాణం చేశారట. వీరి ప్రయాణం  గోవాకి చేరుకోడానికి 2ఏళ్ళు పట్టిందట.  మరొక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే ఈ జంట గోవాలో  బర్మా అనే పిల్లిని దత్తత తీసుకున్నారట. ఆ పిల్లికి పాస్ పోర్ట్ సైతం అప్లై చేసి తమ దేశానికి తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టు పూరీకి చెప్పారట. పూరీకి కూడా మూగ జీవాల పెంపకం చాలా ఇష్టం కదా... తన ఇంట్లో కుక్కలు, పిల్లలు, ఉడతలు వంటివి బాగానే పెంచుకుంటాడట.  అయితే మరో విశేషం ఏమిటంటే ఈ జంటతో తన ‘లోఫర్’ సినిమాలో ఓ సీన్ చేశాడట. వీరికి పారితోషికం ఇచ్చాడని తెలుస్తోంది. ఇక పూరీగారు ఈ జంటను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ జంట అలా నెట్ లో హల్ చల్ చేస్తోందిప్పుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ