ఒక హీరో సొంత బ్యానర్ పై ఇంకొక హీరోతో సినిమాలు నిర్మించడం కళ్యాణ్ రామ్ తో మొదలైంది. ఇప్పుడు హీరోగా కన్నా నిర్మాతగా సినిమాలు తీయడానికి ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్టు కనబడుతోంది. తొలిసారిగా రవి తేజా-సురేందర్‌రెడ్డి కాంబినేషన్ తో ‘కిక్ 2’ మొదలు పెట్టారు. తాజాగా ఇప్పుడు పూరీ జగన్నాథ్-ప్రభాస్ కాంబినేషన్ లో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇప్పటికే స్టోరీ వినిపించడం వంటి పనులన్నీ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ప్రభాస్ కాంబినేషన్ లో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ రెండూ బాక్స్ఆఫీస్ వద్ద ఫ్లాపయిన చిత్రాలు. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ హిట్ చిత్రాన్ని నిర్మించాలనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సినీ వర్గాల్లో ఓ చర్చనీయాంశం అయ్యింది. అయితే పూరీ టెంపర్ సినిమాతో, ప్రభాస్ బాహుబలితో బుజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టుమొదలు ముహూర్తానికి ఇంకా డేట్ ఖరారు కాలేదు. వీరిద్దరికీ డేట్స్ కుదిరినప్పుడు ఈ చిత్రం మొదలవుతుందని అనుకుంటున్నారు.