ఎన్టీవోడి సినిమాకి కూడా ఆయనే ప్రేరణట

January 30, 2015 | 04:00 PM | 42 Views
ప్రింట్ కామెంట్

సబ్ ఇన్-స్పెక్టర్ దయానాయక్, ముంబై కు చెందిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఆయన బాగా ప్రాచుర్యం పొందారు. సుమారు 80 మంది గ్యాంగ్ స్టర్లను ఆయన ఎన్ కౌంటర్ చేశారట. ప్రస్తుతం ఆయన నాగపూర్ రీజియనల్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా?. ఆయన స్ఫూర్తిగానే పూరి టెంపర్ చిత్రాన్ని తెరకెక్కించారట. అంతేకాదు ఇందులో అందుకే జూనియర్ కి దయా అనే పేరును పెట్టాడట. పూరి దయా నాయక్ ను ఇన్స్ఫిరేషన్ కోవటం కొత్తేమీ కాదు. గతంలో గోలీమార్ చిత్రాన్ని ఆయన జీవిత కథ ఆధారంగానే తీశాడని చెబుతుంటాడు. పోలీసు కాకముందు దయానాయక్ ముంబై రెస్టారెంట్లలో రాత్రి 9 వరకు ప్లేట్ లు కడిగేవాడట. అందుకే గోలీమార్ లో కూడా గోపీచంద్ క్యారెక్టరైజేషన్ అలానే చేశాడు. అంతేకాదు పూరి గురువైన రాంగోపాల్ వర్మ కూడా గతంలో అబ్ తక్ చప్పన్ అనే బాలీవుడ్ చిత్రాన్ని దయా లైఫ్ ఆధారంగానే తీశాడు. తర్వాత అది జగపతిబాబు హీరోగా సిద్ధం అనే పేరుతో తెలుగులో రీమేక్ అయ్యింది. ఇప్పుడు టెంపర్ విషయంలో కూడా వక్కంతం వంశీతో కలిసి పూరి స్టోరీ దయా మీదే రావాలని చెప్పాడట. కాకపోతే నిజాయితీపరుడైన ఓ అధికారి పేరును చిత్రంలో ఫుల్లీ కరప్టెడ్, మనీ మైండెడ్, టోటల్ కన్నింగ్ ఆఫీసర్ అయిన ఎన్టీఆర్ కి పెట్టడమే ఎట్లానో ఉంది కదూ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ