పూరీ జగన్నాథ్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లోఫర్’ సినిమా కాస్తా జేబుదొంగ గా మార్చబోతున్నారట. ఇప్పటికే జేబుదొంగలు ఇద్దరున్నారు తెలుగు సినిమా ఫీల్డులో. ఒకరు శోభన్ బాబు, మరొకరు చిరంజీవి. ఇవి రెండూ చాలా హిట్లు ఈ సినిమాలో అప్పట్లో నటించిన హీరోయిన్లు కూడా చాలా క్రేజ్ ఉన్న భామలు. ఒకరు మంజుల అయితే మరొకరు భాను ప్రియ ఈ రెండు సినిమాలూ పాటల పరంగానూ పెద్ద హిట్లు. మరి హిట్ టైటిల్ తో హిట్ కొట్టాలనుకుంటున్నారేమో పూరీగారు. కానీ ఇందులో నటిస్తున్న దిశా పటాని తెలుగు వారికి కొత్తమ్మాయే. ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదల చేయబోతున్న దశలో ఈ సినిమా పేరును మార్చాలనే ఆలోచనలో ఉన్నారు. టైటిల్ మార్చాలన్న ఆలోచన మాత్రం నిర్మాత సి .కళ్యాణ్ దంటున్నారు. సంచలన దర్శకుడు వర్మ ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది. మంచి మదర్ సెంటిమెంట్ తో ఉన్న ఈ సినిమాకు ఆ టైటిల్ బాగుండదని చెప్పినట్టు తెలుస్తోంది. అన్నట్టు ఇందులో వరుణ్ తేజ్ కు తల్లిగా రేవతి, తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరో జేబుదొంగ గా కనిపిస్తాడట ! దీన్నిబట్టి చుస్తే ఈ సినిమాకు జేబుదొంగ అనే టైటిల్ బాగుంటుందని దన్నే ఫిక్స్ చేసేలా ఉన్నారు.