బాహుబలి సినిమా గురించి ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఏ దర్శకుడూ ఆయనను ప్రశంసించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు రాంగోపాల్ వర్మ మాత్రం తన వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా అయినా వినిపించారు. బాముబలి సినిమా చూశాకైనా మన హీరోలు మారాలంటూ చురకలంటిస్తున్నాడు. మంచి కాన్సెప్ట్ లకు స్టార్ హీరోలు తోడైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయని... కేవలం స్టార్ పవర్ను మాత్రమే నమ్ముకుంటే ప్రయోజనం లేదనీ, హాలీవుడ్ ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించిందని, మన ఇండస్ట్రీలో దానికి బాహుబలి దాహరణ అని వర్మ ట్వీట్ చేశాడు. ‘‘బాహుబలి సినిమాతో రాజమౌళి మన ఇండస్ట్రీ మొతతంలో క న్యూనత భావాన్ని తీసుకొచ్చాడు. అతడి బాటలో నడిస్తే తప్ప దీనికి చికిత్స దొరకదు. బాహుబలి సినిమా మన స్టార్లందరికీ ఒక మేలు కొలుపు. ఇకనైనా వాళ్లందరూ ఉన్నతంగా ఆలోచించాలి. లేదంటే ఎప్పుడూ కిందే ఉంటారు. ఓ సినిమా అందులో నటించిన స్టార్ కంటే మిన్నగా కనిపించడం ఇదే తొలిసారి. శ్రీమంతుడులో మహేష్ మాత్రమే ఉన్నాడు. కిక్-2 అంటే రవితేజ. కానీ బాహుబలి అలా కాదు. స్టార్ నుమించిన ఇమేజ్ ఆ సినిమాకు వచ్చింది. బాహుబలి తర్వాత వచ్చే పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చినా, బాహుబలి ప్రత్యేకంగా ఉంటుంది. మంచి కాన్సెప్ట్లకు స్టార్ హీరో పవర్ను యాడ్ చేసే సినిమాలు రావాలి. హాలీవుడ్ ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించింది’’ అని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.