వామ్మో! వాలెంటైన్స్ డేను వదలని వర్మ

February 15, 2016 | 12:57 PM | 2 Views
ప్రింట్ కామెంట్
RGV released single X valentines day poster looks erotic niharonline

ఇక వర్మకు అడ్డు లేదు. సెన్సార్ బోర్డు నిర్ణయాలను ఎల్లప్పుడూ బహిరంగంగా విమర్శించే ఆర్జీవీ ఇక మరిన్నిసంచలనాలకు తెరలేపబోతున్నాడు. ఆర్జీవి టాకీస్ పేరుతో ఆన్లైన్ షార్ట్ ఫిల్మ్స్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటన ఇచ్చిన సంగతి తెల్సిందే. తన దర్శకత్వంలో పాటు కొత్తవారిని కూడా ఎంకరేజ్ చేస్తానని ఆయన ప్రకటించాడు కూడా. ఇక సెన్సార్ కత్తెర్లకు పనిలేకుండా తన రసికత్వం మొత్తాన్ని చూపే పనిలో పడ్డాడు.  ‘సింగల్ ఎక్స్’ పేరుతో తన మొదటి షార్ట్ ఫిలింను రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందో ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు వాలెంటైన్స్ డేను కూడా వదలకుండా మరో పోస్టర్ ను విడుదల చేశాడు వర్మ.

                       మొదటి పోస్టర్లో బాత్ రూంలో అమ్మాయి మొహం చూపకుండా కేవలం ఇన్నర్ వేర్ పై ఉన్న ఫోటో పోస్ట్ చేసిన వర్మ తాజాగా మరో ఎరోటిక్ పోస్టర్ ను విడుదల చేశాడు. ”ఆన్ థిస్ వాలెంటైన్స్ బ్లొవ్ యువర్ లవ్ విత్ సింగల్ ఎక్స్” అంటూ వర్మ పోస్టర్ రిలీజ్ చేసాడు. ఈ పోస్టర్ తో అప్పటివరకు ఉన్న ఈ షార్ట్ ఫిలిం అంచనాలు రెట్టింపు అయ్యాయి. యూత్ అయితే ఈ పోస్టర్ చూసి వామ్మో వర్మ అంటున్నారు. కేవలం బ్రా, ఇన్నర్ వేర్ తో ఉన్న ఓ అమ్మడు నెయిల్ పాలిష్ వేసుకుంటున్న పిక్చర్ ను పోస్ట్ చేశాడు. అచ్చం పోర్న్ పిక్చర్ లా ఉందా పోస్టర్, అఫ్ కోర్స్ అందులోని సుందరి కూడా. కావాలంటే మీరు కూడా ఈ పిక్ ఫై లుక్ వెయ్యండి. ఇక ట్రైలర్ కోసం అంతా వెయిటింగ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ