ఇదేదో కొత్త సినిమా టైటిల్ అనుకునేరు. ఒకప్పుడు పవన్ వీరాభిమానిని అని ప్రకటించుకున్న రాంగోపాల్ వర్మ ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. పవన్ రాజకీయ ఎంట్రీతో పెద్ద తప్పుచేశాడనీ తరచూ ఈ మధ్య ట్విట్టర్ లో వర్మ ఫైర్ అవుతూనే ఉన్నాడు. అయితే నేరుగా కాకుండా వ్యంగ్యంగా పవన్ పై, ఆయన అభిమానులపై సెటైర్లు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయటంపై వర్మ పవన్ కి సలహా ఇస్తున్నాడు.
అసలు బాలీవుడ్ లో విడుదల చేయడంపై పునరాలోచన చేయాలని కోరుతున్నాడు. బాహుబలి లాంటి చిత్రం విజువల్ వండర్స్ కారణంగా బాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యిందని, ఒకవేళ అంతకు మించి విజువల్ వండర్స్ 'సర్దార్ గబ్బర్ సింగ్' లో ఉంటే నిరభ్యంతరంగా విడుదల చేయవచ్చని చెబుతున్నాడు. జాతీయ స్థాయిలో 'బాహుబలి'తో ప్రభాస్ స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడని చెప్పిన వర్మ, ఆ స్థాయిని అందుకోవాలంటే అంతకుమించిన విషయం సర్దార్ లో విషయం ఉండాలని అంటున్నాడు. అంతేకాదు బాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కంటే ప్రభాసే గొప్ప అని కూడా తేల్చేశాడు. అసలు పవన్ పక్కనున్న వారు, ఆయన శిఖరమంత తప్పు చేయనివ్వకుండా చూడాలంటూ ట్విట్టర్ లో వర్మ కోరుతున్నాడు. దీనిపై పవన్ ఏమోగానీ ఆయన ఫ్యాన్స్ రెస్ఫాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పట్లో పవన్-ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఫ్లెక్సీల వివాదం జరిగిన విషయం తెలిసిందే.