ఎక్స్ పోజింగ్ కారణమా లేక పొగరా?

March 19, 2016 | 03:33 PM | 3 Views
ప్రింట్ కామెంట్
nithya-menon-no-to-mahesh-babu-niharonline

సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలనే చాలా మంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. అప్ కమింగ్ హీరోయిన్లు సైతం ఇంటర్వ్యూలో తామంతా మహేష్ కి వీరాభిమానులం అని, ఆయనతో చిత్రంలో చిన్న పాత్ర దొరికినా చాలని చెప్పే వారున్నారు. అలాంటిది ఏరీ కోరీ అవకాశం ఆమెను వెతుక్కుని వెళ్లితే కాదని చెప్పేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనేగా... ఎవరో కాదు టాలెంటెడ్ నటి నిత్యామీనన్.

                       ఇంతకీ అవకాశం వచ్చింది కూడా ఏ చిత్రంలోనో కాదు. త్వరలో మహేష్ –మురగదాస్ చిత్రం పట్టాలెక్కబోతుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ల కోసం వేట కొనసాగుతోంది కానీ, ఇంతవరకు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. కీర్తి సురేష్, శృతీహాసన్ ఇలా అందరూ అయిపోయాక ఇప్పుడు నిత్య మీనన్ చెంతకి ఆ అవకాశం వెళ్లిందట. అయితే కేవలం స్కిన్ షోతో స్టార్ హీరోయిన్లుగా మారతున్న కాలంలో నటనపరంగా కూడా విజయాలను సొంతం చేసుకోవచ్చుఅని చెబుతూ ఆ ఆఫర్ ని తోసిపుచ్చిందని తెలుస్తోంది.  ఈ చిత్రంలో కాస్త ఎక్స్ పోజింగ్ చేయాలని, అందుకోసం నిత్యకు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనేది ఈ వార్త సారాంశం. హీరోయిన్ అంటే కేవలం పాటలు, గ్లామర్ కోసమే కాదనేది నటన ముఖ్యమని తన సిద్ధాంతమని, దానిని నమ్ముకునే సినిమాలు చేస్తానే తప్ప పారితోషకం తనకు ముఖ్యం కాదని చెప్పిందట. ఇప్పటికే పొగరుబోతు ట్యాగ్ లైన్ తగిలించుకున్న నిత్యకి ఈ స్టేట్ మెంట్ మరింత స్ట్రాంగ్ గా మారుస్తుందనటంలో ఎలాంటి సందేహం మాత్రం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ