ఓ వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్....

April 21, 2015 | 02:25 PM | 45 Views
ప్రింట్ కామెంట్
wedding_rgv_niharonline

ఎప్పటి మాదిరిగానే రాం గోపాల్ వర్మ మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడండీ. అదీ ఆయన వెడ్డింగ్ కార్డ్ అంటూ... కాకపోతే... జనాలు అలవాటు పడి ఉన్నారు కాబట్టి... సినిమా ప్రమోషన్ అని వెంటనే కనిపెట్టేశారు.  సినిమా ప్రమోషన్ కు ఇదొక వెరైటీ మార్గం అనుసరించాడాయన. ఒక వెడ్డింగ్ కార్డ్ విడుదల చేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు. వర్మ తాజా చిత్రం "365 డేస్" ప్రమోషన్ కోసం ఈ ఇన్విటేషన్ ని ముద్రించారు. ఈ ఇన్విటేషన్ లో ఆయన ఈ చిత్రం ఆడియో పంక్షన్ వివరాలను ఇచ్చారు. ఏప్రియల్ 23 సాయింత్రం ..తాజ్ దక్కన్ లో ఈ ఆడియో పంక్షన్ జరగనుంది. కత్తులు, తుపాకులు, గ్యాంగ్ స్టర్లు, టెర్రరిస్టులు, దెయ్యాలు, భూతాలు నేపధ్యంలోనే తన పాతికేళ్ల కెరీర్ లో ఎప్పుడూ సినిమాలు తీసారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల్లోని పాత్రలు అయితే క్రిమినల్స్, లేదా అలాంటి సంఘటనలతో క్రిమినల్స్ గా మారిపోవడమే జరుగుతుంటుంది. అడపాదడపా ఏమైనా రొమాంటిక్ సినిమాలు తీసినా అవి ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లోనే, లేక ఏదో థ్రిల్లర్ ఎలిమెంట్ బ్యాక్ గ్రౌండ్ లోనో రూపొందుతాయి. అయితే మొదటి సారి ప్రేమ చిత్రం తీశాడట. ఈ సినిమాలో వయెలెన్స్ అనేది మచ్చుకు కూడా కనిపించదట. ఈ చిత్రం పేరు 365 డేస్. పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుంది అనే అంశం నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుందంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేష్‌ మాట్లాడుతూ '365 డేస్‌'లో నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే వర్మ తన 25 ఏళ్ల కెరీర్‌లో 100% పూర్తి లవ్‌, రొమాంటిక్‌ చిత్రం చేయడం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రం చూసినవాళ్లు ఈ చిత్రకథ ప్రతి ప్రేమజంటకి ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్‌ అవుతుందని చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కరి ప్రేమ కథ. ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్‌ గోపాల్‌ వర్మ పిలుపు నివ్వబోతున్నారు.' అన్నారు. నిఖితశ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి. వెంకటేష్‌ ఈ సంవత్సరంలో మూడు సినిమాలు నిర్మించబోతున్నట్టు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ