ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఎంత మంచికి వాడుకుంటామో దాంతో అంతే చెడు చేయోచ్చనేది అక్షర సత్యం. ఇటీవల కొన్ని ఉదంతాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఇది చెడు బాట పట్టింది ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేయటం, వాటిని ఇంటర్నెట్ లో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందటం ఎక్కువైంది. ఎలాంటి విమర్శలు లేకుండా సైలెంట్ గా ఉండి తమ పనిని చేసుకునే వారిని సైతం వాళ్ల ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసం ఆకతాయిలు చేసే పనితో అవి సంచలనంగా మారుతున్నాయి. తాజాగా మరో హీరోయిన్ కి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించిన రాధిక ఆప్టేకు సంబంధించిన న్యూడ్ ఫోటోలంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో వున్న అమ్మాయి పోలికలు దాదాపుగా రాధికా ఆప్టేకు చాలా దగ్గరగా వున్న నేపథ్యంలో ఈ వివాదం రేగింది. అయితే.. ఈ ఫోటోల వ్యవహారం తెలుసుకున్న రాధికా ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు సైబర్ పోలీసులకు కూడా ఈ విషయమై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మొదటగా ఈ ఫోటోలు వాట్సాప్ ద్వారా అప్ లోడ్ అయ్యి అక్కడి నుంచి ఇతర సైట్లలోకి వచ్చేశాయట. మొత్తానికి ఎవరో చేసిన పిచ్చిపనులకు పాపం రాధిక ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.