సినీ తారలు ముఖ్యంగా హీరోయిన్లు తమ బాడీ షేప్ సక్రమంగా ఉంచుకోడానికి చాలా కష్టపడుతుంటారు. షూటింగ్ లో నిర్మాతలు ఆఫర్ చేసే ఫుడ్ ఆబగా లాగించే హీరోయిన్లు ఓ రెండు సినిమాల్లో చేశారంటే ఇక ఇంటి దారి పట్టాల్సిందే. ఓ పదేళ్ళ పాటు ఇండస్ట్రీలో మనగలగాలంటే ముఖ్యంగా జిహ్వచాపల్యం తగ్గించి. బాడీకి కాస్త పని కూడా కల్పించాలి. వరుస హిట్లతో మాంచి ఫాంలో ఉన్న ఈ చెన్నై అమ్మడు సమంత ఇప్పుడు జిమ్ లో తలమునకలై బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. తన బాడీ ఫిట్ గా ఉంచుకునేందుకు చాలా కష్టపడుతోంది. ఈ అమ్మడు దాదాపు 95 కేజీల బరువును మోస్తున్న ఒక వీడియో సోషల్ నెట్వర్క్ కు చిక్కింది. ఫారిన్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఆమె రోజు విడిచి రోజు ఇలా జిమ్ లో గడుపుతోందట. ఈ ఎక్సరసైజ్ ఆమెను ఫిట్ గా ఉంచటమే కాక, బాడీ వంపులను చెక్కినట్టుగా ఉంచుతుందట. అంతే కాదు బరువు పెరగకుండా ఉంటుందట కూడా. ఈ వీడియో చూసిన వారంతా నాజూకైన సమంత ఇంత కఠినమైన ఎక్సరసైజ్ లు చేస్తుందా అని నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. ఇప్పుడు కష్టపడితేనే కదా నాలుగు రాళ్ళు (కోట్లు) వెనకేసుకోవచ్చు. ఓ నాలుగేళ్ళు పోతే ఇక తల్లిపాత్రలకే రమ్మంటుంది ఈ ఇండస్ట్రీ!