రాధిక కూతురు రయానే క్రికెటర్ ను వివాహమాడబోతున్నట్టు గత కొద్ది రోజుల క్రితం వార్తలకెక్కిన విషయం తెలిసిందే. ఈ రోజు ఈ ఇరువురికీ నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధిక, శరత్ కుమార్ లు నిశ్చితార్థం ఏర్పాట్లను ఘనంగా చేశారు. క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో ఆమెకు పరిచయం ఏర్పడడం, అది ప్రేమకు దారితీయడం ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహానికి సంసిద్ధులయ్యారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. రాధికకు తన రెండో భర్త, బ్రిటిషర్ అయిన రిచర్డ్ హార్డీ ద్వారా రయానె జన్మించింది. అతనితో విడిపోయిన తర్వాత రాధిక శరత్ కుమార్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రయానె ప్రస్తుతం రాధికకు చెందిన రాడాన్ మీడియా వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ వివాహ నిశ్చితార్థం పూర్తిగా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిపించారు.