శ్రీకాంత్ కొడుకు కోసం రెహ్మాన్ తనయుడి పాట

February 11, 2016 | 05:34 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Rahman-son-Ameen-croons-a-song-for-nirmala-convent-niharonline

తన సంగీతంతో అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయిన మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహ్మాన్ వారసుడు గాయకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదివరకే ఓకే కన్మణి(తెలుగులో ఓకే బంగారం)లో ఓపాట పాడిన అమీన్ ఇప్పడు ఓ తెలుగు సినిమా కోసం పాటపాడుతున్నాడు. ఇంతకీ అమీన్ పాట పాడేది ఎవరికో కాదు తెలుగు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ చిత్రానికి. నిర్మలా కాన్వెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ నటుడు అక్కినేని నాగార్జున నిర్మించటం విశేషం.

ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తున్నాడు. అమీన్ పాడిన ఈ పాటను రేపు (ఫిబ్రవరి 12) విడుదల చేస్తున్నారు. నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోషన్ సరసన  'జై చిరంజీవ', 'రోబో', 'దూకుడు' వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ హీరోయిన్ గా  నటిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ