రెహ్మాన్ కు చేరువవుతున్న మరో గౌరవం

June 17, 2015 | 04:30 PM | 0 Views
ప్రింట్ కామెంట్
A_R_Rahman_music_iranian_film_niharonline

భారత దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత  ఏ ఆర్ రెహ్మాన్‌ది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనదో ప్రత్యేక శైలి. ప్రపంచవ్యాప్తంగా ఇతన్ని ఇష్టపడని శ్రోత లేడు. సినిమా సంగీతంలో రెహమాన్ చేయని ప్రయోగం లేదు.   తన వినూత్న శైలితో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి మ్యూజిక్ అందించి 2009లో ఆస్కార్ సంపాదించి, భారత జాతి గౌరవాన్ని నిలబెట్టాడు. అటువంటి రెహ్మాన్ మళ్ళీ మరో రికార్డుకు రెడీ అవుతున్నాడట. ఇరాన్‌లో  నిర్మాణం జరుపుకుంటూ పర్షియన్, అరబిక్ భాషల్లో రూపొందుతున్న మహమ్మద్ అనే  సినిమాను ఇంగ్లీష్ భాషలోకి అనువదిస్తున్నారు. గతేడాది మూడు హాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ అందించిన  ఏ ఆర్ రెహమాన్‌కు ఈ సంవత్సరం ఈ మూవీకి సంగీతం అందించే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం  రెహమాన్ ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. అయితే  ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ అరబిక్ భాషలోనే ఉంటాయట.. ఇరాన్ చిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పాటలకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తోందట. అంతేకాదు... ఈ  పాటలకు  అద్బుతమైన సంగీతం అందించిన రెహమాన్‌కు ఆస్కార్ అవార్దు  గ్యారంటీ అంటూ పొగడ్తలు కూడా కురిపిస్తున్నారట.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ