అమ్మానాన్న ఓ తమిళమ్మాయితో తెలుగు సినిమాల్లోకి ఎంటరయిన ఆసిన్ ఆ తరువాత చాలా హిట్ సినిమాల్లో నటించింది. అటు తమిళ, మళయాల భాషల్లోనూ చాలా సినిమాల్లో నటించింది. గజనీ సినిమాతో బాలీవుడ్ లో ఒక్కసారిగా హిట్ హీరోయిన్ అయిపోయింది. అయితే అక్కడ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా ఆఫర్లు దక్కకపోవడంతో ఇప్పుడు మూడు ముళ్ళకు సిద్ధపడింది. మొబైల్ కంపెనీ యజమాని రాహుల్ శర్మతో ఆమె పరిచయం... ప్రేమగా మారి త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ఓ సెలెబ్రిటీ జంట పెళ్ళి చేసుకోబోతుందంటే... ఇండస్ట్రీలో వారి గురించే చర్చించుకోవడం మామూలే... ముఖ్యంగా కాబోయే శ్రీమతిని ఖుషీ చేయడానికి అతగాడు ఇచ్చుకునే ఖరీదైన గిఫ్టుల గురించి మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఆశిన్ కాబోయే భర్త రాహుల్ లవ్ ప్రపోజ్ చేసినప్పుడే ఓ ఖరీదైన ఉంగరం గిఫ్ట్‌గా ఇచ్చాడట. అయితే అప్పుడు ఓ బంగారపు ఉంగరం... ఇప్పుడు ఏకంగా వజ్రాల ఉంగరాన్నే ఇచ్చాడు. ఆ..ఉంగరం మీద 'ఎ', 'ఆర్స అనే అక్షరాలను రకరకాల స్మాల్ డైమండ్లతో పొందుపరిచేలా డిజైన్ చేయించాడట. జాతీయ మీడియాలో ఇప్పుడు ఆసిన్ - రాహుల్‌శర్మ ప్రేమ గురించి...ఈ డైమండ్ గిఫ్ట్ గురించి పతాక శీర్షికలతో కథనాలు వస్తున్నాయి. బెల్జియంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఉంగరం కోసం రాహుల్ రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరి వివాహానికి ఓకే చెప్పడంతో త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది.