యంగ్ హీరో రాజ్ తరుణ్, అవికాగోర్ ల కొత్త సినిమా ‘సినిమా చూపిస్త మావ’ మళ్ళీ హిట్ కొట్టినట్టే... ! తన వైజాగ్ యాసతో మళ్ళీ ప్రేక్షకులను అలరించాడు రాజ్ తరుణ్. ఈ జంట 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో పరిచయమై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు మళ్ళీ ఓ హిట్ అందుకున్నారు. అయితే ఇక హీరో రాజ్ తరుణ్ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఎదిగిపోయాడు. దీంతో ఆఫర్లు చేజిక్కించుకుంటున్నాడు. త్వరలో తొమ్మిదిమంది అమ్మాయిలతో ఓ కొత్త సినిమాలో సందడి చేయబోతున్నాడని సమాచారం.
ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తున్న "కుమారి 21 F " లో నటిస్తున్న రాజ్ తర్వాత మూవీని సీనియర్ డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. మధుర శ్రీధర్ నిర్మించే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయని, గోదావరి జిల్లా డైలాగ్స్ తో విలేజ్ బాయ్ లుక్ తో ఎంటర్ టైన్ చేస్తున్న రాజ్ ఈ మూవీలోనూ ఇదే డిక్షన్ తో వంశీ స్టైల్ కు తగ్గట్టు నటిస్తాడని సమాచారం. వంశీ ఆల్ టైం కామెడీ హిట్ లేడీస్ టైలర్ తరహాలో రూపొందే ఈ మూవీ మళ్ళీ వంశీకి అంత హిట్ అందించే దిశగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని టాక్.