సినిమా పక్కీలో దర్శకుడి దోపిడీ...

August 17, 2015 | 02:30 PM | 1 Views
ప్రింట్ కామెంట్
v_sekar_tamil_producer_niharonline

పంచలోహ విగ్రహాలను దొంగిలించి విదేశాలకు అమ్మడం వంటి సీన్లు సినిమాల్లో చాలా చూసుంటాం... ఇలా సినిమాలు తీసే ఓ ప్రొడ్యూషర్, దర్శకుడుగా కూడా అయిన వి.శేఖర్ సినీ ఫక్కీలో స్మగ్లింగ్ చేయ ప్రయత్నించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళ, సినీ పరిశ్రమకు ఇది షాక్ లా అనిపిస్తోంది. ఈ విషయంగా ఓ సీనియర్ డైరెక్టర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పేరున్న నిర్మాత కూడా.  ఈయన 80 కోట్ల విలువ చేయ 8 పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మే ప్రయత్నం చేసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. వి.శేఖర్ అనే ఈ డైరెక్టర్ అచ్చం సినిమా పక్కీలోనే ఈ వ్యవహారం నడిపించాడట. మూడు దేవాలయాలనుంచి ఈ పంచలోహ విగ్రహాలను చోరీ చేయించి వాటిని అమ్మడానికికి యత్నించాడని 63 ఏళ్ళ ఈ ప్రొడ్యూసర్ కమ్ నిర్మాత మీద ఆరోపణలున్నాయి. 2014 లో తన కొడుకు కార్ల్ మార్క్స్‌ తో సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడట. ఈ నష్టాలను భర్తీ చేసే దారి లేక ఇలా వక్రమార్గం పట్టాడు. విగ్రహాలను అమ్మడానికి స్మగ్లర్లతో లాలూచీ పడుతుండగా కోడంబాక్కంలోని తన నివాసంలో బుధవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు. 'కాలం మారి పోచ్చు' వంటి దాదాపు 15 సూపర్ హిట్ చిత్రాలు తీసిన శేఖర్ ఇలా తెరచాటు దొంగగా మారడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రముఖ తమిళ స్టార్స్ ఈయన మూవీల్లో నటించారు. మన సంస్కృతిని ప్రతిబింబించే విగ్రహాలను అమ్మడానికి తాను యత్నించానని, ఎంతో సిగ్గు పడుతున్నానని శేఖర్ పోలీసుల విచారణలో చెప్పాడట. ఈయన దగ్గర  ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించిన ధనలింగంను పోలీసులు మొదట అరెస్టు చేశారు. గత జనవరిలో జరిగిన ఓ విగ్రహం చోరీ కేసులో ధనలింగం నిందితుడు. అప్పటినుంచి వారు శేఖర్ మీద కూడా నిఘా పెట్టారు. తమిళనాడులో దేవతా విగ్రహాలను దొంగిలించి వాటిని విదేశాలకు అమ్ముతున్న ముఠాలు పెరిగిపోవడంతో పోలీసు శాఖలో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ గ్యాంగ్‌లపై కన్నేశారు. ఈ క్రమంలో శేఖర్ దొరికిపోయాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ