ఇదేదో ఆయన సక్సెస్ మంత్రం అనుకుని అందరూ ఫాలో అయిపోయి... ఆనక మేం సక్సెస్ కాలేదూ.... మా పిల్లలు సక్సెస్ కాలేదని... సీరియస్ అయిపోతే చాలా... కష్టం... ఇదంతా బాహుబలి మహిమ... ఈ చిత్రం ప్రభావంతో ఆయన విషయం ఏదైనా వార్తే అవుతుంది మరి.... బాహుబలి చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన వర్క్ హాలిక్ కాబట్టి ఆయన కోసం అంటే ప్రత్యేకంగా ఆయన సమయానికి ఫుడ్ తీసుకునేలా ఓ అసిస్టెంట్ ను నియమించారట. అలా డైట్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడట. అవును ఖచ్చితంగా అన్ని కూడా సమయానికి తినాలని ప్రతీదానికి ఓ సమయం కేటాయించాడట . ఆయన ఏ సమయానికి ఏం తీసుకునే వాడంటే... ఉదయాన్నే ముఖం కడుక్కున్నాక కాఫీ ,టీ లాంటివి ఆయనకు అలవాటు లేవు కాబట్టి ఉదయం ఆరు గంటలకు ఒక ఆపిల్, ఏడు గంటలకు బొప్పాయి పండు, పది గంటలకు కొబ్బరి నీరు, పదకొండు గంటలకు ఫ్రూట్ జ్యూస్ తీసుకునేవారట. మధ్యాహ్నం ఇంటి నుండి వచ్చిన భోజనం చేసేవాడట. మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసు కునేవారట. సాయంత్రం లైట్ గా డిన్నర్. ఇక ప్రత్యేకమైన విషయం ఏంటంటే రాజమౌళిగారికి చికెన్ అంటే చాలా ఇష్టమట ఇది మాత్రం వారానికి నాలుగు సార్లు తప్పనిసరిగా లాగించేస్తారట.